ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం: ఎన్. శ్వేత

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం:  ఎన్. శ్వేత

సిద్దిపేట రూరల్, వెలుగు : నవంబర్ 30న జరిగే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు సీపీ ఎన్. శ్వేత తెలిపారు. బుధవారం కేంద్ర బలగాలు బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ  అధికారులు, స్థానిక ఏసీపీలతో చెక్ పోస్ట్, వెహికల్ చెకింగ్, ఫ్లాగ్ మార్చ్, ఈవీఎం వీవీప్యాడ్, స్ట్రాంగ్ రూమ్ బందోబస్తు పై సమీక్ష నిర్వహించారు. జిల్లా పరిస్థితులు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి గురించి వివరించారు.

శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చేస్తున్నామన్నారు. సమావేశంలో బీఎస్ఎఫ్ కమాండెంట్ ఇంద్రజిత్ చావ్లా, ఎస్ఎస్బీ కమాండెంట్ రఘునాథ్, అడిషనల్ కమాండెంట్ రవి, అసిస్టెంట్ కమాండ్ రాజేశ్​కుమార్, ధర్మరాజ్, ఎస్ఎస్ రాథోడ్, రవి, సర్వేశ్, అడిషనల్ డీసీపీలు అందె శ్రీనివాసరావు, ఎస్.మల్లారెడ్డి, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు రమేశ్, సతీశ్, సురేందర్ రెడ్డి, చంద్రశేఖర్, రవీందర్ రాజు, ఎలక్షన్ సెల్ ఇన్స్​పెక్టర్ భిక్షపతి, ఎస్బీ ఇన్స్​పెక్టర్​ రఘుపతి రెడ్డి, రిజర్వ్ ఇన్స్​పెక్టర్ ధరణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.