‘‘నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా” విడుదల వాయిదా

‘‘నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”  విడుదల వాయిదా

తేజ్ కూర‌పాటి హీరోగా..అఖిల ఆకర్షణ హీరోయిన్ గా నటించిన ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మ’ చిత్రం విడుదల తాత్కాలికంగా వాయిదా పడింది. సెప్టెంబర్ 2న గ్రాండ్ గా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ విషయాన్ని ముల్లేటి నాగేశ్వరరావు, ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బుల వెంక‌టేశ్వరరావు, డాక్టర్ MR చౌదరిలు వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల సెప్టెంబర్ 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామని అనుకున్నామన్నారు. కానీ.. థియేటర్ లు అందుబాటులో లేకపోవడం వల్ల సినిమాని వాయిదా వెయ్యడం జరిగిందని కారణం వివరించారు. సినిమా ట్రైలర్ ని అందరూ ఆదరించారని, కానీ అనుకున్న తేదీలో రిలీజ్ చేయకపోవడాన్ని ప్రేక్షకులు అర్థం చేసుకోవాలన్నారు.

సినిమా రిలీజ్ డేట్ ని త్వరలో ప్రకటిస్తామన్నారు. మంచి కంటెంట్ తో ఉన్న ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్, జీవీ ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ పై ఈ సినిమా రూపొందింది. హుషారు, షికారు, రౌడీ బాయ్స్ లాంటి సూప‌ర్‌హిట్ చిత్రాలలో నటించిన తేజ్ కూర‌పాటి సినిమాలో హీరోగా నటిస్తున్నారు. వెంక‌ట్ వందెల ద‌ర్శకత్వంలో ముల్లేటి నాగేశ్వరరావు నిర్మాణ సార‌థ్యంలో సినిమా తెరకెక్కింది. చిత్రం నుండి విడుదలైన అన్ని పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.