V6 News

సందేశాత్మకంగా ‘నా తెలుగోడు’ సినిమా

సందేశాత్మకంగా ‘నా తెలుగోడు’ సినిమా

హరనాథ్ పోలిచర్ల హీరోగా నటిస్తూ, దర్శక నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘నా తెలుగోడు’. తనికెళ్ళ భరణి, రఘు బాబు, జరీనా వహాబ్, నైరా పాల్, రోనీ కౌలా, సుఫియా తన్వీర్ ఇతర పాత్రలు పోషించారు.  శుక్రవారం సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ నిర్వహించారు.  నిర్మాత  నవీన్‌‌‌‌ యెర్నేని,  దర్శకులు శివ నిర్వాణ, మహేష్‌‌‌‌ బాబు, స్వరూప్‌‌‌‌ అతిథులుగా హాజరై  బెస్ట్ విషెస్‌‌‌‌ చెప్పారు. 

హరనాథ్ పోలిచెర్ల మాట్లాడుతూ ‘తెలుగోడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మంచి కోసం పోరాడేవాడు, ప్రతిభావంతుడు, కష్టపడేవాడు అనేది చూపించాను. తల్లి గొప్పతనం, డ్రగ్స్‌‌‌‌పై అవగాహన, సైనికుల జీవితం, బాల శిశువులను కాపాడటం లాంటి అంశాలను ఇందులో చర్చించాం’ అని చెప్పారు.  ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్స్‌‌‌‌ సుఫియా తన్వీర్‌‌‌‌‌‌‌‌,  నైరా  పాల్‌‌‌‌ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.