నాచగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం హుండీ ఆదాయం రూ.29.62 లక్షలు

నాచగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం హుండీ ఆదాయం రూ.29.62 లక్షలు

గజ్వేల్/ వర్గల్, వెలుగు: వర్గల్ మండలంలోని నాచారం గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఈ సందర్భంగా క్షేత్రంలోని హుండీలను ఒక్కచోట చేర్చి లెక్కింపు చేపట్టారు. గడిచిన 154 రోజులకు సంబంధించిన హుండీ ఆదాయం రూ.29,62,845 వచ్చినట్టు ఆలయ ఈవో విజయరామారావు తెలిపారు. 

కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, సిద్దిపేట డివిజన్ ఎండోమెంట్ ఇన్​స్పెక్టర్​విజయలక్ష్మి, ధర్మకర్తలు కర్రె పద్మ వెంకటేశ్, కొత్తపల్లి శ్రీనివాస్, చందా నాగరాజు, గాలి కిష్టయ్య, ఉషశ్రీ రాజశేఖర్ శర్మ, జగ్గయ్య గారి శేఖర్ గుప్తా, నాయకం శ్రీనివాస్, రుద్ర శ్రీహరి,  సిబ్బంది సుధాకర్, నరేందర్, పాండు, భ్రమరాంబికా, భక్తులు పాల్గొన్నారు.