పార్టీ మారిన ఇద్దరూ టీఆర్ఎస్ నేతలు

పార్టీ మారిన ఇద్దరూ టీఆర్ఎస్ నేతలు

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సీట్లు ఆశించి భంగ పడ్డనేతలు అధికార పార్టీ టీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నాచారం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మేడల మల్లికార్జున్ జ్యోతి దంపతులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. టీఆర్ఎస్ నుండి కార్పోరేటర్ టికెట్ ఆశించిన మల్లికార్జున గౌడ్ ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తమకు ఆశ చూపి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సిట్టింగ్ కే ఇవ్వడంతో మేడల మల్లికార్జున్ జ్యోతి దంపతులు రేవంత్ రెడ్డి సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

మరోవైపు వెంగల్ రావు నగర్ సిట్టింగ్ టీఆర్ఎస్ కార్పొరేటర్ కిలారీ మనోహర్ బీజేపీ లో చేరారు. నిన్నమొన్నటి వరకు ఒకే పార్టీలో తిరిగిన నేతలు ప్రత్యర్ధులు  కావడంతో జీహెచ్ఎంసీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారింది.