బాధతో విలవిల్లాడిన రఫెల్ నాదల్

బాధతో విలవిల్లాడిన రఫెల్ నాదల్

స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ గాయపడ్డాడు. ఆయన ముక్కుకు గాయం కావడంతో బాధతో విలవిల్లాడిపోయాడు. ప్రత్యర్థి కొట్టిన షాట్ లేక కండరాలు పట్టేయడం ఇతరత్రా కారణాలతో ఆయనకు గాయం కాలేదు. ఆయన టెన్నిస్ రాకేట్ తాకడంతో ముక్కుకు గాయమైంది. రక్తం రావడంతో వైద్యులు వచ్చి చికిత్స చేశారు. యూఎస్ ఓపెన్ రఫెల్ పోటీ పడుతున్నారు. గురువారం ఇటలీకి చెందిన ఫాబియో ఫోగ్నినితో తలపడ్డాడు. తొలి సెట్ ను 2-6 తేడాతో నాదల్ ఓడిపోయాడు. ఆ తర్వాత చెలరేగిపోయాడు.

వరుసగా రెండు సెట్లను కైవసం చేసుకుని ప్రత్యర్థి ఫోగ్నినికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. నాలుగో రౌండ్ లో షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ.. రాకెట్ వేగంగా అతని ముక్కును తాకింది. రాకెట్ ను పక్కన పడేసి పడుకుని పోయాడు. ముక్కను నుంచి రక్తం వస్తుండడంతో అక్కడున్న వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. ఓ వైపు నొప్పి ఇబ్బంది పెట్టినా మ్యాచ్ కొనసాగించాడు. నాలుగో సెట్ లో 6-1 తేడాతో ఫోగ్నిపై గెలుపొందాడు. దీంతో 2-6, 6-4, 6-2, 6-1 తేడాతో నాదల్ విజయం సాధించారు.