వింబుల్డన్​ మిక్స్డ్​ డబుల్స్​ సెమీస్లోకి సానియా

వింబుల్డన్​ మిక్స్డ్​ డబుల్స్​ సెమీస్లోకి సానియా

లండన్​ లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక వింబుల్డన్​ టోర్నీ మిక్స్డ్​ డబుల్స్​ విభాగంలో సానియా మీర్జా ‌‌ మేట్​ పావిక్​ జంట సెమీస్​లోకి ప్రవేశించింది. సోమవారం రాత్రి గ్యాబ్రియేలా డాబ్రోవ్​స్కీ ‌‌ జాన్​ పీర్స్​ జోడీతో జరిగిన క్వార్టర్​ ఫైనల్​ మ్యాచ్​ లో సానియా జోడీ చక్కటి ఆటతీరుతో గెలిచింది.  1 గంట 41 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్​ లో  మూడు వరుస సెట్లలో  6–4, 3–6, 7–5 పాయింట్లతో విజయఢంకా మోగించింది. 2022  తనకు చివరి  సీజన్​ అని, దాని తర్వాత  రిటైర్​ అవుతానని సానియా ఇటీవల ప్రకటించారు. ఈనేపథ్యంలో ఆమె కెరీర్లో​ చివరి అతిపెద్ద టోర్నీగా మారిన వింబుల్డన్​లో  సెమీస్​ కు చేరడాన్ని సానుకూల పరిణామంగా అభివర్ణిస్తున్నారు.  

క్వార్టర్​ ఫైనల్స్​ లోకి రఫెల్​ నడాల్

మరోవైపు వింబుల్డన్లోనూ రఫెల్​ నడాల్​ చెలరేగుతున్నాడు.డచ్​ టెన్నిస్​ ప్లేయర్​ బోటిక్​ వాన్​ డీ జాండ్​షల్ప్​ తో జరిగిన మ్యాచ్​ లో 6‌‌‌‌–4 , 6‌‌–2, 7‌‌‌‌–6 పాయింట్ల తేడాతో గెలిచిన నడాల్​ క్వార్టర్​ ఫైనల్స్​ లోకి ప్రవేశించాడు.  శుక్రవారం జరగనున్న సెమీస్​ లో  అమెరికా టెన్నిస్​ ప్లేయర్​ టేలర్​ ఫ్రిట్జ్​ ను నడాల్​ ఢీకొననున్నారు.