పవన్​పై కుట్ర పూరితంగాకేసు నమోదు చేశారు: నాదెండ్ల మనోహర్​

పవన్​పై కుట్ర పూరితంగాకేసు నమోదు చేశారు: నాదెండ్ల మనోహర్​

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పై కుట్ర పూరితంగా కేసు నమోదు చేశారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) అన్నారు.వాలంటీర్ వ్యవస్థపై జనసేనాని పవన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్నారు.కావాలనే పవన్ పై వ్యక్తిగతంగా దాడి చేశారని నాదెండ్ల ఆరోపించారు

వాలంటీర్ల గురించి వాస్తవాలు మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తప్పుడు కేసులు పెడతారా అంటూ ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్  ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థ లో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తే బెదిరింపులకు దిగుతున్నారని ఫైర్ అయ్యారు. వ్యక్తిగత సమాచారం తీసుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు..? అని ప్రశ్నించారు. స్వయంగా సీఎం జగన్ వాలంటీర్లను తన సైన్యం అని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. .2.60 లక్షల మంది వాలంటీర్ల( Volunteer )లో 1,02,530 మంది వాలంటీర్ల సమాచారం అప్ లోడ్ కాలేదని పేర్కొన్నారు. 

వాలంటీర్ల కోసం  ప్రతి ఏడాది రూ.1,560 కోట్లు ఖర్చు చేస్తుండగా..దానిలో రూ.617 కోట్ల డేటా సేకరణ కోసం కేటాయించారు. ఈ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి. ఇంటింటి సమాచారం సేకరించాలని వారికి ఎవరు చెప్పారు.? ఈ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా.? అలా సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారు..? ఈ ప్రశ్నలు వేటికీ సమాధానం చెప్పకుండా మంత్రులు, వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. జనసేన పార్టీకి వాలంటీర్లపై ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదు..’ అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ల పేరుతో దోచుకున్న డబ్బుపై విచారణ చేయిస్తామని నాదెండ్ల హెచ్చరించారు.