బాలయ్య కామెంట్లపై స్పందించిన అక్కినేని బ్రదర్స్

బాలయ్య కామెంట్లపై స్పందించిన అక్కినేని బ్రదర్స్

వీరసింహారెడ్డి సక్సెస్ ఈవెంట్లో హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అక్కినేని, తొక్కినేని అంటూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై అక్కినేని హీరోలు నాగచైతన్య, అఖిల్ స్పందించారు. ఎన్టీఆర్, అక్కినేని, ఎస్వీఆర్ తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలని,  వారిని అగౌరవపరచటం  మనల్ని మనం కించపరుచుకోవటం అవుతుందంటూ ట్వీట్ చేశారు. 

‘వీరసింహుని విజయోత్సవం’ పేరుతో నిర్వహించిన సక్సెస్ ఈవెంట్లో బాలకృష్ణ తన సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లను అభినందించారు.  ఈ క్రమంలో ఓ ఆర్టిస్ట్‌ గురించి చెబుతూ ‘‘ఇక ఈయన ఉన్నారంటే సెట్‌లో నాన్నగారి డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అని మాట్లాడుకుంటుండే వాళ్లం’’ అనేశారు.  దీంతో ఈవెంట్ కు వచ్చిన వారంతా షాకయ్యారు. బాలకృష్ణ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది కాస్తా వివాదాస్పదంగా మారింది.