
టాలీవుడ్ కొత్త దంపతులు నాగచైతన్య, శోభిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ గురువారం (ఆగస్ట్ 21న) ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నాగచైతన్య, శోభిత దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఇవాళే శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ క్రమంలో చైతన్య దంపతులు, త్రివిక్రమ్ వేరు వేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో నాగచైతన్య దంపతులకు పండితులు వేదాశీర్వచనం అందించారు.
ఆ తర్వాత ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వారిని పట్టు వస్త్రంతో సత్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్య, శోభితల వివాహం 2024 డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. పెళ్లి తర్వాతే తండేల్ మూవీతో వచ్చి వందకోట్ల క్లబ్లో చేరాడు. ప్రస్తుతం చైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్ లో ఓ మైథికల్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. ఇందులో నిధి అన్వేషకుడిగా కనిపించనున్నాడు నాగ చైతన్య. తన పాత్ర కోసం ఫిజికల్‌గా, మెంటల్‌గా కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యాడు.