నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైథలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాదులో యాక్షన్ షెడ్యూల్ జరుగుతోంది. ప్రధాన నటీనటులంతా పాల్గొంటున్నారు. గురువారం ఇందుకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. కొన్ని ఎకరాల విస్తీర్ణంలో వందలాది టెక్నీషియన్స్ ఓ భారీ సెట్‌ను నిర్మించడం మొదలు అక్కడ యాక్షన్ సీన్స్ మేకింగ్ వరకు ఈ వీడియోలో చూపించారు.
అలాగే ఇందులోని పాత్ర కోసం నాగచైతన్య ఫిజికల్, యాక్షన్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇంటర్నేషనల్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జుజి మాస్టర్ పర్యవేక్షణలో చైతు ట్రైనింగ్, తన ట్రాన్స్‌ఫర్మేషన్ ఇంప్రెస్ చేశాయి. సినిమా స్థాయి ఎలా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా తెలియజేశారు. నాగచైతన్యకు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా.. ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పార్ష్ శ్రీవాస్తవ కీలక పాత్ర పోషిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కాంతార ఫేం అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.
