డాసోస్‌‌‌‌ క్యాబినెట్ బ్రాండ్ కు.. నటుడు నాగచైతన్య ప్రచారం

డాసోస్‌‌‌‌ క్యాబినెట్ బ్రాండ్ కు.. నటుడు నాగచైతన్య ప్రచారం

హైదరాబాద్‌‌‌‌: లగ్జరీ ఇంటీరియర్స్​ మార్కెట్లోకి అడుగుపెట్టిన డాసోస్‌‌‌‌ క్యాబినెట్స్‌‌‌‌ బ్రాండ్‌‌‌‌కు అంబాసిడర్‌‌‌‌గా సినీ నటుడు నాగచైతన్య ప్రచారం చేయనున్నారు. విశ్వసనీయత, నాణ్యత, ఆధునిక డిజైన్లకు ప్రాధాన్యమిచ్చే డాసోస్‌‌‌‌ బ్రాండ్‌‌‌‌ విలువలకు ఆయన వ్యక్తిత్వం, అభిరుచులు తోడ్పడతాయని సంస్థ తెలిపింది. 

మాహి గ్రూప్‌‌‌‌ ఆధ్వర్యంలో 2023 ఫిబ్రవరిలో ప్రారంభమైన డాసోస్‌‌‌‌ క్యాబినెట్స్‌‌‌‌.. మాడ్యులర్‌‌‌‌ క్యాబినెట్ల తయారీ నుంచి పూర్తిస్థాయి లగ్జరీ ఇంటీరియర్స్‌‌‌‌ రంగంలోకి విస్తరిస్తోంది. ఇందులో భాగంగా పూర్తి స్థాయి ఇంటి ఇంటీరియర్స్‌‌‌‌, ప్రత్యేక కిచెన్లు, వార్డ్‌‌‌‌రోబ్‌‌‌‌లు, క్యాబినెట్లు, రిపేర్లు, టర్న్‌‌‌‌కీ ప్రాజెక్టులతో పాటు సోఫాలు, బెడ్లు, డైనింగ్‌‌‌‌ టేబుళ్లు తదితర ప్రత్యేక ఫర్నిచర్స్​ను రూపొందించనుంది.