నాగ చైతన్య "కష్టాలన్నీ తీరిపోయాయి, ఇకపై సంతోషమే!"... విడాకులు, కొత్త పెళ్లిపై జగ్గు భాయ్ కామెంట్స్ .

నాగ చైతన్య "కష్టాలన్నీ తీరిపోయాయి, ఇకపై సంతోషమే!"... విడాకులు, కొత్త పెళ్లిపై జగ్గు భాయ్ కామెంట్స్ .

అక్కినేని నాగార్జున పెద్దకుమారుడు, యంగ్ హీరో నాగచైతన్య 'తండేల్' మూవీ సక్సెస్ తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చేశారు. వరుస సినిమాలతో ఇప్పుడు ఫుల్ బిజీగామారిపోయారు. అయితే చైతు తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు, వృత్తిపరంగా కొత్త ప్రయోగాలు... ఈ ప్రయాణంలో నటుడిగా, వ్యక్తిగా ఆయన మరింత పరిణతి చెందారు. సమంతతో విడాకులు.. ఆ తర్వాత శోభితను వివాహం చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఓ స్టార్ హీరో చైతన్యతో మాట్లాడుతూ, "నీ జీవితంలోని కష్టాలన్నీ తీరిపోయాయి, ఇకపై నువ్వు జీవితాన్ని పూర్తిగా ఆనందించడమే మిగిలింది" అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.  ఆ వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు, తెలుగు చిత్ర పరిశ్రమలో 'జగ్గు భాయ్'గా అభిమానులు పిలుచుకునే జగపతి బాబు. ఇటీవల జగపతి బాబు హోస్ట్ చేస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే టాక్ షోకి అతిథిగా వచ్చిన నాగ చైతన్యతో ఆయన పంచుకున్న ఆసక్తికరమైన సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల వారసత్వం

అక్కినేని, దగ్గుబాటి... రెండు దిగ్గజ కుటుంబాల వారసత్వాన్ని మోస్తున్న నాగ చైతన్యను జగపతి బాబు ప్రత్యేకంగా అభినందించారు. నాగార్జునతో తనకు ఉన్న స్నేహబంధం గురించి చెప్పి, చైతన్యను ఈ రెండు కుటుంబాల మధ్య వారధిగా అభివర్ణించారు. దీనికి స్పందించిన చైతన్య, మొదట్లో ఈ రెండు లెజెండరీ కుటుంబాల వారసుడిగా ఉండటం కొంత ఒత్తిడి అనిపించినా, ఇప్పుడు దానిని ఒక గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నానని, ఇది తనకు ఒక పాజిటివ్ ఛాలెంజ్ అని చెప్పుకొచ్చారు.

చైతు..  నీ తండ్రి నాగార్జున గారి కంటే నీకే లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని సరదాగా చమత్కరించారు జగపతి బాబు , అదేం లేదు, మొత్తం క్రెడిట్ నాన్నకే వెళ్తుంది..  నేను , నాతమ్ముడు అఖిల్, నాన్నతో బయటకు వెళ్లినప్పుడు.. లేడీస్ అంతా నాన్నతోనే సెల్ఫీ ఎక్కువగా తీసుకుంటుంటారు అంటూ చైతూ నవ్వుతూ సమాధానమిచ్చారు. తనకు కార్ రేసింగ్ అంటే ఎంత ఇష్టమో చెప్పారు నాగచైతన్య. కానీ రోడ్లపై కాకుండా కేవలం అద్దెకు తీసుకున్న రేసింగ్ ట్రాక్‌లపై మాత్రమే బాధ్యతగా డ్రైవ్ చేస్తానని తెలిపారు.

కష్టాలన్నీ తీరిపోయాయి, ఇక ఎంజాయ్ చేయి!

ఇక వీరి సంభాషణలో అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం... నాగ చైతన్య వ్యక్తిగత జీవితం గురించి జగపతి బాబు చేసిన వ్యాఖ్యలు. ఈ సందర్భంగా జగ్గు భాయ్, చైతన్యను చూసి, "నీ వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలన్నీ ఇక తీరిపోయాయి , నీ లైఫ్‌ను హాయిగా, సంతోషంగా గడపడానికి ఇది సరైన సమయం" అని అన్నారు. "గతంలోని ఆ పోరాటాలే నిన్ను మరింత బలంగా తయారుచేశాయి" అని ఆయన వ్యాఖ్యానించారు. జగపతి బాబు చేసిన ఈ కామెంట్స్, చైతన్య మాజీ భార్య సమంతతో విడాకులు తీసుకున్న సంఘటనను ఉద్దేశించి చేసిన పరోక్ష ప్రస్తావనగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. వైవాహిక జీవితంలో ఎదురైన ఆ గడ్డుకాలాన్ని ధైర్యంగా దాటుకుని, ఇప్పుడు కొత్త సినిమాలతో, కొత్త జీవితంతో చైతన్య ముందుకు సాగుతున్నారని అభిప్రాయపడుతున్నారు.

 

చైతన్య సినీ ప్రస్థానం

నాగ చైతన్య సినీ కెరీర్ కూడా ఇప్పుడు ఊపందుకుంది. ఆయన చివరి చిత్రం 'తండేల్' మంచి విజయం సాధించింది. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమాలో చైతన్య శ్రీకాకుళం యాసలో మత్స్యకారుడి పాత్రలో అద్భుతంగా నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న తన 'NC 24' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇది పౌరాణిక అంశాలు ఉన్న ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ అని సమాచారం. 'వృష కర్త' అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో పాన్-ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేస్తున్న చైతూ.. తన నటనలో కొత్త కోణాన్ని చూపించేందుకు చైతు సిద్ధమవుతున్నారు..