పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో

పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో

టాలీవుడ్ హీరో నాగ శౌర్య త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. బెంగుళూరుకు చెందిన అనూష శెట్టితో నాగ శౌర్య వెడ్డింగ్ జరగనుంది. నవంబర్‌ 19, 20వ తేదీల్లో బెంగళూరులో నాగశౌర్య వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జరుగబోతున్నాయి. ఈ పెళ్లికి ఈ నెల 20న ఉదయం 11.25 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇక అనూష శెట్టి బెంగుళూరులో ఇంటీరియర్ డిజైనర్, ఆర్కిటెక్ట్ కూడా పని చేస్తోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని బీఏ రాజు టీం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 

నాగ శౌర్యకు ఇలా సడన్ గా వివాహం ఫిక్స్ కావడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ యంగ్ హీరో ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది షిర్లే సెటియాతో కలిసి కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.