
అక్కినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ . ఇవాళ నాగచైతన్య బర్త్ డే సందర్భంగా NC 22 మూవీకి కస్టడీ అనే టైటిల్ ను మూవీ టీం ఫిక్స్ చేసింది. అధికారికంగా ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. ఈ మూవీలో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిన్నాడు. పోలీసులంతా నాగచైతన్యను పట్టుకుని..గన్స్ పెట్టిన లుక్ ను రిలీజ్ చేశారు. ప్రపంచంలో మార్పు రావాలంటే... ముందుగా నువ్వు మారాలి అనే కొటేషన్ ఫస్ట్ లుక్ లో కనిపిస్తోంది.
కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. బంగారాజు తర్వాత నాగచైతన్యతో కృతిశెట్టి మరోసారి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. శరత్ కుమార్,అర్వింద్ స్వామి ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు