‘వృక్షో రక్షతి రక్షితః’ అనే సందేశంతో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘కలివి వనం’. ఫోక్ సాంగ్స్‌తో పాపులరైన యూట్యూబర్ నాగదుర్గ ఇందులో లీడ్ రోల్ చేస్తోంది.
రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రాజ్ నరేంద్ర దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి నిర్మిస్తున్నారు. నవంబర్ 21న సినిమా విడుదల కానుంది.
శనివారం (Nov8) ఈ మూవీ ట్రైలర్‌ను ప్రసాద్ ల్యాబ్స్‌లో లాంచ్ చేశారు. దర్శకుడు రాజ్ నరేంద్ర మాట్లాడుతూ ‘సినిమా అంటే వినోదమే కాదు, విజ్ఞానం అని చెప్పే సినిమా ‘కలివి వనం’. మనం దేవుడితో పాటు ప్రకృతిని కూడా పూజించాలనే విషయం పిల్లలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ సినిమాని తీశాం.
పెద్ద బాలశిక్షలో ఒక పేజీలా ఈ సినిమా వాళ్ళ మైండ్‌లో ఉండిపోతుంది. అందుకే పెద్దలు తమ పిల్లలకు ఈ సినిమా చూపించాలని కోరుతున్నాం’ అని చెప్పారు. నటుడు సమ్మెట గాంధీ, మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ ఎస్.కె తదితరులు పాల్గొన్నారు.
డైరెక్టర్ రాజ్ నరేంద్ర:
తెలుగు దర్శకుడు రాజ్ నరేంద్ర అనేక సినిమాలు మరియు షార్ట్ ఫిల్మ్స్కి పనిచేశారు. 2014 లో ''జాబిల్లి కోసం ఆకాశమల్లె'' సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్రీహరి, సుమన్ మరియు అనూప్ తేజ్ నటించారు. 2023లో, 'అనుకోకుండా - ఏమి జరిగిందంటే' మూవీ చేశాడు. ఆ తర్వాత వస్తున్న మూడో ఫిల్మ్ కలివనం.
యూట్యూబర్ నాగదుర్గ:
తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో పాపులర్ అయింది యూట్యూబర్ నాగదుర్గ. లాక్‌డౌన్‌లో ఆమె నటించిన తిన్నాతిరం పడతలే.. పాట వంద మిలియన్ల వ్యూస్ సాధించింది. ఆ పాటతో ఆమెకు అవకాశాలు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. ఎన్నో యూట్యూబ్ సాంగ్స్‌లో అందంగా స్టెప్పులేసింది. ఇటీవలే "నా పేరు యెల్లమ్మ" పాట కూడా దుమ్మురేపింది. ఈ క్రమంలోనే వరుస సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు అందుకుంటుంది. కలివనంతో పాటు తమిళంలో కూడా హీరోయిన్‌గా ఛాన్స్ అందుకుంది.
కోలీవుడ్ స్టార్ ధనుష్ మేనల్లుడు పవీష్ నారాయణ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. మగేశ్ రాజేంద్రన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. జినిమా మీడియా సంస్థ నిర్మిస్తోంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ధనుష్ దర్శకత్వం వహించిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ చిత్రంతో హీరోగా పరిచయమైన పవీష్‌కు ఇది రెండో చిత్రం. ఇక నల్గొండకు చెందిన నాగదుర్గ స్వతహాగా కూచిపూడి డ్యాన్సర్. ఇటీవల ఆమె చేసిన ‘దారి పొంటోత్తుండు’ పాట హండ్రెడ్ మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసింది.
మ్యూజిక్ డైరెక్టర్ మదీన్:
దారిపొంటత్తుండు, ఎర్రా ఎర్రా రుమాలు, అత్తగారి ఇంటికి, నాపేరు ఎల్లమ్మ, సిటికేస్తే పోయే ప్రాణం వంటి టాప్ ఫోక్ సాంగ్స్ కి మదిన్ SK ట్యూన్స్ ఇచ్చారు. ఇపుడు ఈ ఫోక్ ప్రపంచం ఇండస్ట్రీని ఏలడానికి వస్తుంది. జనాలు ఎలాంటి ఆదరణ అందిస్తారో అనే ఆసక్తి నెలకొంది.
