నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత

నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత
  •   ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్  సంతాపం

చెన్నై: నాగాలాండ్ గవర్నర్  లా గణేశన్(81) శుక్రవారం కన్నుమూశారు. ఈ నెల 8న చెన్నైలోని టీ నగర్​లో గణేశన్  తన ఇంట్లో కిందపడడంతో తలకు గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను అపోలో హాస్పిటల్​లో జాయిన్  చేశారు. వారం రోజులుగా ట్రీట్​మెంట్  తీసుకుంటున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో శుక్రవారం సాయంత్రం 6.23 గంటలకు తుదిశ్వాస విడిచారు.

1945 ఫిబ్రవరి 16న తంజావూరులో గణేశన్  జన్మించారు. దివంగత మాజీ సీఎం కరుణానిధితో పాటు ప్రస్తుతం సీఎం ఎంకే స్టాలిన్, ఇతర డీఎంకే లీడర్లతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. కాగా..  గణేశన్  మృతిపై ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్​ సంతాపం తెలిపారు. గణేశన్​ మరణవార్త తనకు ఎంతో బాధ కలిగించిందని ప్రధాని ‘ఎక్స్’ లో పేర్కొన్నారు.