మంచి మెసేజ్ ఇచ్చాడు.. బురదలో ఇరుక్కుపోయిన మంత్రి

మంచి మెసేజ్ ఇచ్చాడు.. బురదలో ఇరుక్కుపోయిన మంత్రి

నాగాలాండ్ టూరిజం మరియు ఉన్నత విద్యా శాఖ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా  సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా ఉంటారు. ఫన్నీ వీడియోలు పెడుతూ  అందరకీ నవ్వులు పూయిస్తుంటారు.  తాజాగా బురదలో కూరుకుపోయిన ఓవీడియోను ఆయన షేర్ చేయగా అది వైరల్ గా మారింది.  అయితే ఫన్నీగా షేర్ చేసిన ఈ వీడియో వెనకాల చాలా పెద్ద విషయమే దాగి ఉంది.  

ALSO READ :- శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో బీభత్సం.. నుజ్జునుజ్జయిన రెండు కార్లు

చేపల చేరువులోకి దిగిన ఆయన  అందులో  కూరుకుపోయి బయటకు వచ్చేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. ముగ్గురు వ్యక్తులు అతనికి సహాయం చేసినప్పటికీ పైకి రాలేకపోయారు.  ఎట్టకేలకు పాకుతూ బయటకు వచ్చి నవ్వుతున్న వీడియోను ఆయన షేర్ చేశారు.   తనకు సహాయం చేసిన వ్యక్తులకు టెమ్‌జెన్ ఇమ్నా  కృతజ్ఞతలు తెలిపారు.  

ఈ వీడియోకు మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా ఒక ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇవాళ జేసీబీకే పరీక్ష...  గమనిక:  కారును కొనుగోలు చేసే ముందు దాని ఎన్‌సీఏపీ (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) రేటింగ్‌ను తనిఖీ చేయమని ప్రజలకు సూచించడానికి ఇమ్నా ఈ ఫన్నీ పోస్ట్‌ను పంచుకున్నారు.  . ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.1 లక్షల మందికి పైగా వీక్షించారు. 12 వేల మందికి పైగా లైక్ చేశారు