నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్ కలెక్టరేట్లోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) లో తప్పనిసరిగా నమోదు కావాలని, లేకపోతే వేతనాలు చెల్లించబోమని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ స్పష్టం చేశారు.
సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హాజరు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే ఈడీఎంతో సమన్వయం చేసుకుని వెంటనే పరిష్కరించుకోవాలని ఆదేశించారు.
