నాగర్ కర్నూల్ జిల్లాలో 36 మంది పంచాయతీ కార్యదర్శులపై వేటు

నాగర్ కర్నూల్ జిల్లాలో 36 మంది పంచాయతీ కార్యదర్శులపై వేటు

నాగర్ కర్నూల్ జిల్లాలో 36 మంది పంచాయతీ కార్యదర్శులపై వేటు పడింది. కరెంట్ బిల్లులకు సంబంధించిన చెక్కులను సకాలంలో చెల్లించనందుకు 36 మంది పంచాయతీ కార్యదర్శులపై నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు.  ట్రాక్టర్ల EMIలు సకాలంలో చెల్లించనందుకు సస్పెండ్ చేశారు. సకాలంలో బిల్లులు చెల్లించాలని చాలా సార్లు చెప్పినా.. విధుల పట్ల అలసత్వం ప్రదర్శించిన వారిపై వేటు పడింది. ఈనెల 25వ తేదీ లోపు కరెంటు బిల్లులకు సంబంధించిన చెక్కులను చెల్లించాలి. కానీ, 29వ తేదీ పూర్తవుతున్నా.. ఇంకా చెల్లించకపోవడంతో జిల్లా కలెక్టర్ 36 మంది పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకున్నారు.