‘శివ’ చిత్రం ఓ మ్యాజిక్ అని, 4కే డాల్బీ ఆట్మాస్ రీ రిలీజ్ వెర్షన్ చూస్తున్నప్పుడు కొత్త సినిమా చూసిన ఫీలింగ్ కలిగిందని నాగార్జున అన్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో1989లో విడుదలైన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని వెంకట్, సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌కు 50 ఇయర్స్ యానివర్సరీ రోజున నవంబర్ 14న థియేటర్లలో మరోసారి రిలీజ్ చేస్తున్నారు. సోమవారం స్పెషల్ ప్రీమియర్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ ‘‘శివ’కి ఇంత ఆదరణ కల్ట్ ఫాలోయింగ్ ఉంటుందని కలలో కూడా అనుకోలేదు.
36 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రాము అప్పుడు ఎంత ఇష్టపడి చేశాడో రీ రిలీజ్ కోసం కూడా ఆరు నెలల నుంచి అంతే ఇష్టంతో వర్క్ చేశారు. డాల్బీ అట్మాస్‌కి తగ్గట్టుగా ఈ సౌండ్‌ని రీ క్రియేట్ చేశారు. ప్రతీ భాషలో చూడాల్సిన క్లాసిక్స్ ఉన్నాయి. వాటన్నిటికీ శివ ఒక పాత్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నా’ అని అన్నారు. 36 ఏళ్ల తర్వాత చూసిన ఈ చిత్రం ఆడియెన్స్‌కు కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందని రామ్ గోపాల్ వర్మ అన్నాడు.
