కరోనా హాట్‌‌‌‌స్పాట్‌‌‌‌గా నాగార్జునసాగర్

కరోనా హాట్‌‌‌‌స్పాట్‌‌‌‌గా నాగార్జునసాగర్
  • బై ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్న లీడర్లు, క్యాడర్‌‌‌‌‌‌‌‌కు పాజిటివ్
  • వాళ్ల నుంచి జనాలకు, ఎన్నికల సిబ్బందికి వైరస్
  • 19న ఒక్క రోజే సాగర్‌‌‌‌‌‌‌‌లో 160 కేసులు నమోదు
  • ఇయ్యాల సూర్యాపేటలో మంత్రి ఈటల రివ్యూ

నల్గొండ, వెలుగు: ఇటీవల బై ఎలక్షన్స్​ జరిగిన నాగార్జున సాగర్ నియోజకవర్గం కరోనా వైరస్ హాట్‌‌‌‌స్పాట్‌‌‌‌గా మారింది. లోకల్​లీడర్లతో పాటు వివిధ  జిల్లాల నుంచి వచ్చి ప్రచారంలో పాల్గొన్న నేతల్లో చాలా మందికి కరోనా సోకింది. వాళ్ల ద్వారా జనాలకూ వైరస్ వ్యాపించింది. మార్చి 1 ముందు నల్గొండ జిల్లాలో పెద్దగా కేసులు లేకున్నా, క్యాంపెయిన్​స్టార్ట్​ అయ్యాక కేసులు భారీగా పెరిగాయి. గత నెల 1 నుంచి ఏప్రిల్​18 వరకు నల్గొండ జిల్లాలో 4,164 పాజిటివ్​ కేసులు వచ్చాయి. ఇందులో సాగర్​ఏరియా హాస్పిటల్‌‌‌‌లోనే వెయ్యికి పైగా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఎన్నికలు ముగిసినప్పటికీ కరోనా తగ్గుముఖం పట్టలేదు. సోమవారం ఒక్క రోజే సాగర్​ నియోజకవర్గ పరిధిలో 160 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆఫీసర్లు చెబుతున్నారు. మీడియాకు సమాచారం ఇవ్వొద్దని సోమవారం ప్రభుత్వం ఓరల్​ఆర్డర్స్​ ఇవ్వడంతో సరైన నంబర్ బయటకు రావడం లేదు. వాస్తవానికి సాగర్ నియోజకవర్గం పరిధిలోని పీహెచ్‌‌‌‌సీల్లో  సోమవారం టెస్టులు చేయగా  వందల సంఖ్యలో కేసులు బయట పడ్డాయని తెలిసింది.
ప్రచారం చేసిన ఇతర జిల్లాల నేతలూ అలర్ట్
టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్, ఆయన కుటుంబ సభ్యులకు పాజిటివ్ రావడంతో ప్రస్తుతం వారంతా హైదరాబాద్‌‌‌‌లో హోం ఐసోలేషన్‌‌‌‌లో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీళ్లతోపాటు పార్టీ లీడర్లు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్​రెడ్డి, ఆయన భార్య నివేదితరెడ్డి, కాంగ్రెస్ లీడర్, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయం తెలియడంతో ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన నేతలంతా అలర్ట్​ అయ్యారు. రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల నుంచి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర స్థాయి నేతలు, క్యాడర్ కరోనా నిబంధనలు మర్చిపోయి, రోజుల తరబడి ప్రచారం చేయడంతో వారంతా ఇప్పుడు కరోనా భయంతో టెస్టులకు పోతున్నారు.
ఎలక్షన్ టైమ్‌‌‌‌లో ఎవరూ పట్టించుకోలే
ప్రస్తుతం సాగర్‌‌‌‌‌‌‌‌లో వేలాది మంది కరోనా లక్షణాలతో సఫర్ అవుతున్నారు. ఎలక్షన్ల టైమ్‌‌‌‌లో కరోనా తీవ్రత గురించి పలువురు హెచ్చరించినా అధికారులు, నాయకులు ఎవరూ పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ ప్రచార సభను రద్దు చేయాలని రైతులు కోర్టులో అప్పీలుకు కూడా వెళ్లారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఎన్నికల కమిషన్‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా వేల మందితో బహిరంగ సభ నిర్వహించారు. ఇప్పుడు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ అభ్యర్థితో పాటు సీఎం కేసీఆర్ కరోనా బారినపడడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఎలక్షన్​ టైమ్‌‌‌‌లోజిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌‌‌‌ కూడా కరోనా సోకడంతో ఆయన ఇంటి నుంచే ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిడమనూరు తహసీల్దార్​ఆఫీసులో పనిచేస్తున్న ఆర్ఐకీ పాజిటివ్ వచ్చింది. ఎన్నికల ఆర్వో ఆఫీసు ఇక్కడే ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్​గుర్రంపోడు ఇన్‌‌‌‌చార్జిగా వ్యవహరించిన ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి డ్రైవర్లకు, ఆయన వెంట వచ్చిన పలువురు లీడర్లకు పాజిటివ్ వచ్చింది. టీఆర్ఎస్ స్టేట్ లీడర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ కరోనా లక్షణాలు కనిపించడంతో హోం ఐసోలేషన్​లో ఉంటున్నా రు.

నేడు సూర్యాపేటకు ఈటల
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం సూర్యాపేటకు రానున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జి ల్లా మంత్రి జగదీశ్​రెడ్డితో కలిసి సూర్యాపేటలో ఉదయం 11.30 గంటలకు రివ్యూ చేయనున్నారు.