సాగర్ కౌంటింగ్​ ఇయ్యాల్నే

సాగర్ కౌంటింగ్​ ఇయ్యాల్నే
  • నేడు సాగర్​ ఉప ఎన్నిక రిజల్ట్
  • ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు షురూ
  • కౌంటింగ్​ కేంద్రం వద్ద మూడంచెల భద్రత
  • రాత్రి 8 గంటలకు తుది ఫలితం !
  • కొవిడ్ రూల్స్​ పాటిస్తేనే కౌంటింగ్ ​సెంటర్​లోకి ఎంట్రీ

నల్గొండ, వెలుగు: నాగార్జున సాగర్​ఉపఎన్నిక ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి.  నల్గొండలోని ఆర్జాలబావి సమీపంలోని స్టేట్​వేర్​ హౌసింగ్​గోదాం కౌంటింగ్ కేంద్రంలో​ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పో స్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కిస్తారు. రెండు కౌంటింగ్​హాల్స్ లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.  ప్రతి టేబుల్​కు ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్ తోపాటు మరో ముగ్గురు సిబ్బందిని నియమించారు. మొత్తం 400 మంది  సిబ్బంది కౌంటింగ్ ప్రాసెస్ లో పాల్గొంటున్నారు. గుర్రంపోడు మండలం నుంచి ఓట్ల లెక్కింపు స్టార్ట్​ అయి త్రిపురారం మండలంతో ముగుస్తుంది. ప్రతి రౌండ్​ కౌంటింగ్​ముగియడానికి కనీసం అరగంట పడుతుంది. మొదటి ఫలితం ఉదయం 8.30 గంటలకు వెల్లడయ్యే ఛాన్స్​ఉంది. మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తిచేస్తారు. తుది ఫలితం వెల్లడయ్యే సరికి రాత్రి 8 గంటలు కావచ్చని ఆఫీసర్లు చెప్పారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యం మృతితో సాగర్ నియోజకవర్గానికి ఏప్రిల్ 17న ఉపఎన్నిక జరిగింది. మొత్తం 41 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహయ్య కొడుకు భగత్, బీజేపీ నుంచి రవికుమార్ పోటీ చేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్నందున కౌంటింగ్​లో పాల్గొంటున్న సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులకు మూడు రోజుల నుంచే కరోనా టెస్టులు చేశారు. మాస్కులు పెట్టుకుని, కరోనా నెగెటివ్​రిపోర్ట్​తో వచ్చిన వాళ్లను మాత్రమే కౌంటింగ్​ కేంద్రంలోకి అనుమతిస్తామని అధికారులు చెప్పారు. కౌంటింగ్​కేంద్రం వద్ద  మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.