నాగార్జునసాగర్‌లో జోరందుకుంటున్న ప్రచారం

నాగార్జునసాగర్‌లో జోరందుకుంటున్న ప్రచారం
  • నేటి నుంచి బీజేపీ జాతీయ, రాష్ట్ర లీడర్ల రోడ్ షోలు
  • నేడు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారం 
  • 14న హాలియాలో సీఎం కేసీఆర్ సభ

నల్గొండ, వెలుగు: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. ఎన్నికల ప్రచారానికి ఇంకా వారం రోజులే మిగిలి ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారంపైనే ఫోకస్ పెట్టాయి. సీఎం కేసీఆర్ రెండో దఫా ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ఈ నెల 14న సీఎం సభ హాలియాలో జరగనుంది. శుక్రవారం నుంచి కాంగ్రెస్, బీజేపీ లీడర్లు సాగర్ లో రోడ్ షోలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఎంపీ రేవంత్ రెడ్డి రాకపైనే నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు ఆశ పెట్టుకున్నాయి. శుక్రవారం నుంచి ఆయన సాగర్లో పర్యటించనున్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సీనియర్ నాయకులు విజయశాంతితో పాటు, కేంద్ర మంత్రులు, జాతీయ ఎస్టీ, ఎస్సీ నాయకులు సాగర్లో పర్యటిస్తారని రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎన్నికల మేనేజ్మెంట్కమిటీ చైర్మన్ గంగడి మనోహర్ రెడ్డి చెప్పారు. వీరితో పాటు మండల ఎన్నికల ఇన్చార్జిలుగా పార్టీ సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 15వ తేదీ వరకు నియోజకవర్గవ్యాప్తంగా 500 మీటింగ్లు పెట్టాలన్నది బీజేపీ లక్ష్యం. ఒక్కో ఇన్చార్జి కనీసం 30, 40 మీటింగ్స్లో  పాల్గొంటారు. 
12 నుంచి బండి సంజయ్ ప్రచారం
బీజేపీ పార్టీ చీఫ్ బండి సంజయ్ ఈ నెల 11న రాత్రి నల్గొండ చేరుకుని బస చేస్తారు. మరుసటి రోజు 12న నల్గొండ నుంచి బయల్దేరి గుర్రంపోడు మండలం నుంచి రోడ్షో ప్రారంభిస్తారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత తిరిగి పెద్దవూర మండలంలో రోడ్షో మొదలవుతుంది. రాత్రివరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి నల్గొండకు బయల్దేరి వెళతారు. అక్కడే రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు 13న ఉదయం నల్గొండ నుంచి బయల్దేరి హాలియా చేరుకుంటారు. అక్కడే జరిగే ఉగాది పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం హాలియాలో ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరగనుంది. అదే రోజు సాయంత్రం తిరుమలగిరి మండలంలోని గిరిజన తండాల్లో పర్యటిస్తారు. 14న ఏపీలోని తిరుపతిలో జరిగే ప్రచారంలో సంజయ్ పాల్గొంటారు. మళ్లీ 15న నిడమనూరు మండలంలో జరిగే ప్రచారానికి వస్తారు. 
10,11 తేదీల్లో కిషన్ రెడ్డి రోడ్ షో
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  శుక్రవారం రాత్రి నల్గొండ చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు. 10న ఉదయం నల్గొండ నుంచి బయల్దేరి త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో రోడ్షో స్టార్ట్ చేస్తారు. సాయంత్రం వరకు ఈ మండలంలోని అన్నిగ్రామాల్లో పర్యటించి, రాత్రికి నల్గొండకు చేరుకుంటారు. 11న ఉదయం నల్గొండ నుంచి బయల్దేరి అనుమల మండలం పులిమామిడి గ్రామంలో రోడ్షో  ప్రారంభిస్తారు. సాయంత్రం వరకు అనుమల మండలంలోనే ప్రచారం చేస్తా రు. 
నేటి నుంచి డీకే అరుణ రోడ్ షో
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ శుక్రవారం నుంచి నాలుగు రోజులపాటు అనుమల మండలంలో ప్రచారంలో పాల్గొంటారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు అనుమల మండలం కొట్టాల గ్రామంలో రోడ్షో ప్రారంభిస్తారు. ఇక్కడ నుంచి వరుసగా 1 0, 11, 14, 15 తేదీల్లో అనుమల మండలంలో పర్యటిస్తారు. సీనియర్ నాయకులు విజయశాంతి త్రిపురారం, తిరుమలగిరి, పెద్దవూర మండలాల్లో జరిగే రోడ్షోలో పాల్గొంటారు. సాగర్లో గిరిజన తండాలకు ఇన్చార్జిగా రవీంద్రనాయక్ను నియమించారు.
బీజేపీ మండల ఇన్చార్జిలు 
మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్రావు(నిడమనూరు), మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి (మాడ్గులపల్లి), మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు(గుర్రంపోడు), 
కె.మురళీధర్రావు(పెద్దవూర), డాక్టర్ లక్ష్మణ్(హాలియా మున్సిపాలిటీ), 
ఎమ్మెల్యే రఘునందన్రావు(తిరుమలగిరి), బాబూమోహన్(నందికొండ మున్సిపాలిటీ), మాజీ ఎంపీ జితేందర్రెడ్డి (త్రిపురారం) ఇన్చార్జిలుగా వ్యవహరించనున్నారు.