నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు మూసివేత

నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు మూసివేత

నల్గొండ: కృష్ణా నదిలో వరద తగ్గుముఖం పట్టడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. రెండు రోజులుగా వరద తగ్గుతూ వస్తోంది. దీంతో వరద ప్రవాహానికి అనుగుణంగా గేట్లను ఒక్కొక్కటిగా మూసివేస్తూ వచ్చిన అధికారులు కొద్దిసేపటి క్రితం మొత్తం గేట్లను మూసివేశారు. ఉదయం 6 గంటల సమయంలో నమోదైన రికార్డుల ప్రకారం నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో  55,185  క్యూసెక్కులు వస్తోంది. దీంతో 45,954 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం  312.0405 టీఎంసీలు కాగా.. 310.8498 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతూ వరదను కంట్రోల్ చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులు ఉంది.