7రోజుల్లో 21 టీఎంసీలకు చేరిన నాగార్జునసాగర్

7రోజుల్లో 21 టీఎంసీలకు చేరిన నాగార్జునసాగర్

540 అడుగులకు చేరిన నాగార్జునసాగర్

హాలియా, వెలుగు: నాగార్జునసాగర్​ ప్రాజెక్ట్​లో కి గత వారం రోజులుగా ఇన్​ఫ్లో కొనసాగుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్ట్​ నుంచి 21 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు కెపాసిటీ 312 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 188.9 530 టీఎంసీల నీళ్లున్నాయి. 590 అడుగులకుగాను ఆదివారం సాయంత్రానికి 540 అడుగులకు నీరు చేరుకుంది.సాగర్​ జలాశయం నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఎస్ఎల్ బీసీ కాల్వ ద్వారా 1500 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ఇదే సమయంలో సాగర్ జలాశయానికి 42,378 క్యూసెక్కుల నీరు వస్తోంది.

ప్రాజెక్టులకు పెరిగిన వరద

రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు వరద నీటి ప్రవాహం పెరిగిం ది. గోదావరి బేసిన్ లో శ్రీరాంసా గర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కు పెద్ద ఎత్తున వరద వస్తోంది. ఇన్ ఫ్లో 11 వేల క్యూ సెక్కుల నుంచి 26 వేల క్యూసెక్కులకు పెరగగా, నీటి నిల్వ 38. 08 టీఎంసీలకు చేరింది. కడెం ప్రాజెక్టుకు 315, ఎల్లం పల్లికి 2,967 క్యూసెక్కు ల ఇన్ ఫ్లో వస్తోంది. ఎల్లం పల్లిలో నీటి నిల్వ 6.98 టీఎంసీలకు పెరిగిం ది. కృష్ణా బేసిన్ లో శ్రీశైలం ప్రాజెక్టుకు 74 వేల క్యూసెక్కు ల ఇన్ ఫ్లో ఉండగా, నీటి నిల్వ 89.09 టీఎంసీలకు చేరింది. కర్నాటకలోని ఆల్మట్టికి వరద తగ్గడంతో, కిందికి వదిలే నీటిని 6 వేల క్యూసెక్కులకు తగ్గించారు. జూరాలకు 25 వేలక్యూసెక్కు ల ఇన్ ఫ్లో వస్తుండగా, 20వేల క్యూసెక్కు లు కిందికి వదులుతున్నారు.