నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. సోమవారం నాగర్ కర్నూల్ మున్సిపాలిటి పరిధిలోని ఓ గార్డెన్లో ఎన్నికల అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బ్యాలెట్ బాక్సుల నిర్వహణ, రూల్స్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. .
ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికలు సక్సెస్ చేయాలన్నారు. కేంద్రాల వద్ద వృద్ధులు, వికలాంగులు, గర్భిణులకు సౌలతులు కల్పించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఏజెంట్లను మాత్రమే అనుమతించాలన్నారు. అనంతరం తాడూరు ఎంపీడీవో ఆఫీస్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ మెటీరియల్ ను పరిశీలించారు.

