అచ్చంపేట, వెలుగు : ఫుడ్ పాయిజన్ కారణంగా 32 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా మన్ననూర్ పీటీజీ స్కూల్ లో గురువారం జరిగింది. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. గమనించిన సిబ్బంది వెంటనే అచ్చంపేట హాస్పిటల్ కు తరలించారు.
గణేశ్, ప్రేమ్, చరణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్ మెంట్ చేస్తున్నారు. ఐదుగురి పరిస్థితి మెరుగుపడడంతో వారిని ఇంటికి పంపించగా, మిగిలిన 27 మందిని జనరల్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ దేవ సహాయం, అచ్చంపేట ఆర్డీవో యాదయ్య, మాజీ ఎంపీ, బీజేపీ నేత రాములు హాస్పిటల్ చేరుకొని స్టూడెంట్లను పరామర్శించారు.
అనంతరం మన్ననూర్ పీటీజీ స్కూల్ ను పరిశీలించి, వంట సామాగ్రి, తాగునీటిని పరిశీలించి, మెరుగైన వసతులు కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఫుడ్ పాయిజన్ కు కారణమైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
