లింగాల, వెలుగు: నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థుల శారీరక దారుఢ్యాన్ని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలు సరైన నిర్వహణ లేక బట్టలు ఆరేసుకునే స్టాండ్లుగా మారుతున్నాయి.
వ్యాయామం కోసం ఏర్పాటు చేసిన ఇనుప కడ్డీలు, ఊయలలపై విద్యార్థులు దుస్తులు వేలాడదీస్తుండటంతో పరికరాల ఏర్పాటు ప్రధాన లక్ష్యం నీరుగారుతోంది. ఈ వింత పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ, అధికారులు తక్షణమే స్పందించి ఈ పరికరాలను పూర్తిస్థాయిలో విద్యార్థుల వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
