పాలమూరు జిల్లాకు చెందిన కొల్లూరు శివరాజు ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్కు ఎంపిక

పాలమూరు జిల్లాకు చెందిన కొల్లూరు శివరాజు ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్కు ఎంపిక

నాగర్​ కర్నూల్, వెలుగు: ఈ నెల 26న ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్​లో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన 30 మంది ఒగ్గు కళాకారుల బృందంలో పాలమూరు జిల్లాకు చెందిన పీజీ విద్యార్థి కొల్లూరు శివరాజుకు చోటు దక్కింది. 

జడ్చర్ల మండలం కుచ్చరకల్ కు చెందిన శివరాజు కొల్లాపూర్ పీజీ కాలేజీలో ఎంఏ సెకండియర్​ చదువుతున్నాడు. గతంలో ఐపీఎల్, గోల్కోండ కోటపై నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకలతోపాటు దాదాపు 30 వరకు ప్రదర్శనలు ఇచ్చినట్లు తెలిపాడు.