
నాగశౌర్య హీరోగా పవన్ బాసింశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రంగబలి’. యుక్తి తరేజ హీరోయిన్. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘లవ్ స్టోరీ’ ఫేమ్ సి.హెచ్.పవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి ఫస్ట్ సాంగ్‌ను బుధవారం లాంచ్ చేశారు. ‘మన ఊరిలో ఎవడ్రా ఆపేది’ అనే పల్లవితో సాగే ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడాడు. దర్శకుడు పవన్, శ్రీ హర్ష ఈమని కలిసి లిరిక్స్ రాశారు. అనురాగ్ కులకర్ణి డైనమిక్‌గా పాడాడు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో నాగశౌర్య చేసిన మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం జులై 7న విడుదల కానుంది.