భారత్ సైన్యంలో మరో కొత్త ఆయుధం చేరింది..ఆత్మనిర్భర్ భారత్ లో ఇదో ముందడుగు. దీనిని పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించారు. నాగపూర్ లోని సోలార్ ఇండస్ట్రీస్ తయారు చేసిన దేశంలోనే మొదటి స్వదేశీ లాయిటర్ అయిన నాగాస్ట్ర-1.. ఇండియన్ ఆర్మీ అందుకుంది. సోలార్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ఎకనామిక్స్ ఎక్స్ ప్లోజివ్స్ లిమిటెడ్ (ఈఈఎల్) తో ఎమర్జెన్సీ ప్రొక్యూర్ మెంట్ పవర్స్ కింద 480 లోయిటర్ ఆయుధాలకోసం ఆర్మీ ఆర్డర్ చేయగా.. ప్రీ డెలివరీ పరీక్షల విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత EEL ఆర్మీ ఆయుధ కారాగారానికి 120 లోయిటర్ ఆయుధాలు డెలివరీ చేసింది ఈఈఎల్. మేకిన్ ఇండియా నాగాస్త్ర- 1 గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.. అవేంటో చూద్దాం..
నాగాస్త్ర-1 ఇదొక UAV ఆధారిత వ్యవస్థ.. ఆత్మాహుతి డ్రోన్.. ఆకస్మిక వైమానిక దాడులకు ఇది బాగా పనిచేస్తుంది. సోలార్ నాగాస్త్ర -1 అటాక్ చేయడమే కాదు.. అవసరమైతే దాడిని అపగలిగే సామర్థ్యం కలిగి ఉంది. ఇది దాడి చేసి సురక్షితంగా తిరిగి రాగలదు. లక్ష్యానికి పైన హోవర్ చేయగల సామర్థ్యం ఉండటంతో దీనిని లాటరింగ్ ఆయుధం అని పేరు పెట్టారు.
నాగాస్త్ర-1 .. కామికేజ్ మోడ్ లో పనిచేస్తుంది. ఇది GPS తో ఖచ్చితమైన స్ట్రైక్ తో ఏదైనా శత్రు ముప్పును అడ్డుకుంటుంది. ఇది 4500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఎగురుతూ రాడార్ వ్యవస్థ చిక్కకుండా లక్ష్యాన్ని చేధిస్తుంది. ఉదాహరణకు .. ఒక నిర్ధిష్ట టైంలో నిర్ధిష్ట ప్రనదేశానికి వెళ్లడానికి ఓ మిలిటెంట్ ను తీసుకెళ్లే కార్వాన్ ను నాగాస్త్రం -1 గాలిలో తిరుగుతూ లక్ష్యంపై దాడి చేయగలదు. ఇది కేమికేజ్ మోడ్ లో దాడి చేస్తుంది. లక్ష్యాన్ని నాశనం చేయడంతోపాటు అది కూడా స్మాష్ అవుతుంది. అందుకే దీనిని ఆత్మాహుతి డ్రోన్ అని పిలుస్తారు.
నాగాస్త్ర-1 ఆత్మాహుతి డ్రోన్.. ఫిక్స్ డ్ వింగ్ ఎలక్ట్రిక్ UAV మ్యాన్ ఇన్ లూప్ రేంజ్ , అటానమస్ మోడ్ రేంజ్ 30 కిమీలు. 60 నిమిషాలపాటు గాలిలో లక్ష్యంపై గురిపెడుతుంది. దీనిలో రాత్రి పగలు నిఘా కెమెరాలతోపాటు లోయిటర్ మ్యూనిషన్ సాఫ్ట్ ఫిట్స్ స్కిన్ లక్ష్యాలను చేధించగల వార్ హెడ్ అమర్చబడి ఉంటుంది. ఈ Loiter Munition లో ఉన్న అబార్ట్, రీకవర్ , రీయూజ్ ఫీచర్లు దీనిని అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చేసిన సారూప్య వ్యవస్థలస్థ కంటే మెరుగైన పనితీరును ప్రదర్శిస్తుంది. ఒకవేళ మిషన్ నిలిపివేయబడితే తిరిగి దానిని వెనక్కి రప్పించొచ్చు. పారాచూట్ ఉపయోగించి సాఫ్ట్ లాండింగ్ చేయవచ్చు.