తిరుమల మెట్ల మార్గంలో ప్రత్యేక నిఘా: నాగేశ్వరరావు

తిరుమల మెట్ల మార్గంలో ప్రత్యేక నిఘా: నాగేశ్వరరావు

తిరుమల నడకమార్గంలో ఇటీవల క్రూర మృగాల దాడులు ఎక్కువవుతుండంపై రక్షణ చర్యల ఏర్పాట్లను అటవీ శాఖ అధికారులు పర్యవేక్షించారు. చీఫ్​ కన్జర్వేటివ్​ఆఫ్ ఫారెస్ట్​ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో వన్యమృగాల సంచారంపై మరింత నిఘా పెంచడానికి 400 ట్రాప్ కెమెరాలు అమర్చినట్లు వెల్లడించారు. 

చిరుతలు, ఎలుగు బంట్లను బంధించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. నడకమార్గంలో వెళ్తున్న భక్తులు ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తగిన జాగ్రత్తలు తీసుకుని గుంపులుగా వెళ్లాలని సూచించారు. 

చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుత ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అటవీ శాఖ, టీటీడీ అధికారులు ఇచ్చిన గైడ్​లైన్స్​ తప్పక పాటించాలని సూచించారు.