పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి : డీజీ నాగిరెడ్డి 

పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి : డీజీ నాగిరెడ్డి 
  • ఫైర్ సర్వీసెస్ సిబ్బందికి సెలవులు రద్దు చేశాం 
  • ఫైర్ షాపులకు తాత్కాలిక లైసెన్స్‌‌‌‌లు జారీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : దీపావళి పండుగ రోజు ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నామని ఫైర్స్ సర్వీసెస్‌‌‌‌ డీజీ వై. నాగిరెడ్డి తెలిపారు. డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పనిచేస్తున్న సిబ్బంది సెలవులు రద్దు చేశామని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తాత్కాలిక ఫైర్ క్రాకర్స్ షాప్‌‌‌‌ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి టెంపరరీ లైసెన్సు జారీ చేశామని తెలిపారు. క్రాకర్స్ కాల్చే సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జనాలకు ఆయన పలు సూచనలు చేశారు.

ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే పటాకులు కాల్చాలని, పార్క్‌‌‌‌ చేసిన వెహికల్స్, మూసివేసి ఉన్న గదులు, కాంపౌండ్స్‌‌‌‌లో క్రాకర్స్ వెలిగించకూడదన్నారు. సిల్క్‌‌‌‌ దుస్తులు కాకుండా కాటన్‌‌‌‌ దుస్తులు మాత్రమే ధరించాలన్నారు. ఇసుక, డ్రమ్స్‌‌‌‌లో నీటిని అందుబాటులో పెట్టుకోవాలన్నారు. పటాకులు కాల్చే చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. గాయపడితే వెంటనే డాక్టర్​ను సంప్రదించాలన్నారు. కరెంట్ స్తంభాలు, గడ్డి ఉన్న ప్రాంతాలకు దూరంగా క్రాకర్స్ కాల్చాలని ఆయన సూచించారు.

రైళ్లలో పటాకులు తీసుకెళ్లొద్దు: సౌత్ సెంట్రల్ రైల్వే

సికింద్రాబాద్ :  రైళ్లలో పటాకులను తీసుకెళ్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెబుతున్నారు. దీపావళి పటాకులను తీసుకెళ్లిన వారికి  రైల్వే యాక్ట్ 1989 సెక్షన్164, 165 ప్రకారం రూ. వెయ్యి జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందన్నారు. నేర తీవ్రత ఆధారంగా ఫైన్, జైలు శిక్ష రెండూ విధించే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరించారు. రైలులో అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు కనిపిస్తే హెల్ప్ లైన్ నం.139కు కాల్ చేయాలని ప్రయాణికులకు సూచించారు.