
ఆదివాసుల ఆరాధ్యదైవం నాగోబా జాతర మహాపూజలకు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి మం. కేస్లాపూర్ నుండి మెస్రం వంశస్తుల పాదయాత్రగా బయలుదేరారు. నాగోబాను అభిషేకించే గంగా జలాల సేకరణ ఈ పాదయాత్ర చేస్తు్న్నారు. 10న కలమడుగు వద్ద గోదావరిలో గంగా జలాల సేకరించి.. 17న నాగోబా క్షేత్రానికి చేరుకుంటారు. ఈ నెల 21న అమావాస్య అర్ధరాత్రి నాగోబాకి పవిత్ర గంగా జలాలతో అభిషేకం చేస్తారు. 21 నుండి వారం రోజుల పాటు నాగోబా జాతర జరుగనుంది. పాదయాత్రలో మెస్రం వంశస్తులు పెద్దఎత్తున పాల్గొంటారు.
ఈ చారిత్రక ఆలయానికి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంది. సమ్మక్క సారక్క జాతర తర్వాత అతి పెద్ద గిరిజన జాతరగా నాగోబా గుర్తింపు పొందింది. నాగోబా పూజా పురస్కారాలు నిర్వహించే మెస్రం వంశీయుల ఆచారాల వ్యవహారాలు మిగిలిన గిరిజనులకు భిన్నంగా ఉంటాయి. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో 1956లో మొదటిసారి నాగోబాకు గుడిసెను ఏర్పాటు చేయగా, 1995లో రాతితో ఆలయాన్ని నిర్మించారు. దాని స్థానంలో కొత్త ఆలయం కోసం 2017లోనే మెస్రం వంశీయులు ఏకంగా రూ. 5 కోట్లు జమ చేసి, నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాగోబా ఆలయంతో పాటు సతీదేవత ఆలయ నిర్మాణం కూడా చేపట్టారు. ఇప్పటివకే ప్రతిష్ఠాపనోత్సవాలు ప్రారంభం కాగా, ఈ నెల 18 వరకు పూజ కార్యక్రమాలు కొనసాగించి, చివరి రోజు నూతన విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు.