కాగ జ్ నగర్, వెలుగు: కాగజ్నగర్రైల్వే స్టేషన్లో నాగ్ పూర్–సికింద్రాబాద్ వందే భారత్ రైలు హాల్టింగ్ ప్రారంభమైంది. గురువారం సాయంత్రం ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీ చిన్న మైల్ అంజిరెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు సౌత్ సెంట్రల్ రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయనాథ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా జెండా ఊపి రైలును ప్రారంభించారు.
రైల్వేల అభివృద్ధికి, మారుమూల ప్రాంతాల ప్రజలకు రైలు సౌకర్యం కల్పించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ స్టేషన్ లో మరిన్ని రైళ్లకు హాల్టింగ్వచ్చేలా చూస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్, ఏడీఆర్ఎం గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
