
ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీనుంచి ఎంపీపీ కావటంతో చర్య
కామారెడ్డి, వెలుగు: ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ నుంచి ఎంపీపీగా ఎన్నికయ్యారని పేర్కొంటూ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట ఎంపీపీ కృష్ణవేణిపై అనర్హత వేటు వేశారు. ధర్మారెడ్డి ఎంపీటీసీ స్థానం నుంచి కృష్ణవేణి( కాంగ్రెస్) గెలుపొందారు. మెజార్టీ సీట్లు కాంగ్రెస్‌కు రావడంతో ఇక్కడ ఎంపీపీ పదవి దక్కించుకొవటానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అయితే కృష్ణవేణితో పాటు మరో ఎంపీటీసీ ఎంపీపీ పదవి కోసం పోటీ పడ్డారు. పార్టీ అధిష్ఠానం మరో అభ్యర్థి పేరు ప్రకటించింది. కృష్ణవేణిని ఎంపీపీగా పోటీ చేస్తే తాము మద్దతు ఇస్తామని టీఆర్‌ఎస్ సభ్యులు ఆఫర్ చేశారు. దీంతో ఆమె టీఆర్‌ఎస్ సభ్యుల మద్దతుతో ఎంపీపీగా ఎన్నికయ్యారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. విప్ ను ధిక్కరించి ఇతర పార్టీ సభ్యుల మద్దతుతో ఎంపీపీగాఎన్నిక కావటంపై కాంగ్రెస్ నాయకులు రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. విప్ పై సంతకం తనది కాదని కృష్ణవేణి అధికారులకు తెలిపారు. అయితే ఫోరెనిక్స్ టెస్ట్‌లో సంతకం ఆమెదని తేలడంతో అనర్హత వేటు వేశారు.