మీ తమ్ముడు అరెస్టయ్యాడు.. డబ్బులు పంపండి: మహిళ వద్ద 2లక్షలు కొట్టేసిన స్కామర్లు

మీ తమ్ముడు అరెస్టయ్యాడు.. డబ్బులు పంపండి: మహిళ వద్ద 2లక్షలు కొట్టేసిన స్కామర్లు

బషీర్​బాగ్​, వెలుగు: నకిలీ వీసాతో మీ తమ్ముడు అరెస్ట్​అయ్యాడని సైబర్ ​నేరగాళ్లు ఓ మహిళ వద్ద డబ్బులు కొట్టేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. మెహదీపట్నంకు చెందిన 38  ఏండ్ల మహిళకు స్కామర్స్ వాట్సాప్ కాల్ చేశారు. ఖతార్‎లో వీసా సమస్యతో ఆమె సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. కేసు నుంచి కాపాడాలంటే రూ.2 లక్షలు పంపాలని డిమాండ్​ చేశారు. నమ్మిన  డబ్బులు ట్రాన్స్​ఫర్​చేసింది. సోదరుడికి ఫోన్ చేయగా అరెస్ట్ కాలేదని చెప్పడంతో  సైబర్​ క్రైం పోలీసులకు ఆమె కంప్లైంట్ చేసింది.