
ఖిలా వరంగల్ (రంగశాయి పేట) వెలుగు: కొత్తగా వెహికల్ కొనుగోలు చేసినవారు, దానికి ఫ్యాన్సీ నంబర్‌ను తీసుకోవడం సెంటి మెంట్. కాగా.. వరంగల్ జిల్లా రంగశాయిపేట ఆర్టీఏ ఆధికారులు శుక్రవారం ఫ్యాన్సీ నంబర్ 9999ను వేలం వేశారు. ఓ వ్యాపారవేత్త రూ.11 లక్షలకు కొనుగోలు చేశాడు. ఆ నంబర్ కోసం అధికార పార్టీ నేతలతో పాటు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తీవ్రంగా పోటీ పడ్డారు.
చివరకు వరంగల్ కు చెందిన వ్యాపారవేత్త 11,09, 999 లకు కొనుగోలు చేసి దక్కించుకున్నాడు. ఇదే నంబర్‌కు అతను గతంలో కూడా చాలాసార్లు ప్రయత్నించారు. చివరకు ఆన్ లైన్ వేలంలో పాల్గొని సొంతం చేసుకుని ఆనందం వ్యక్తం చేసినట్టు రవాణాశాఖ అధికారులు చెప్పారు.