నాగుల పంచమి ప్రత్యేకం: శివుడు చెప్పిన పూజ

నాగుల పంచమి ప్రత్యేకం: శివుడు చెప్పిన పూజ

శ్రావణమాసం అంటేనే వ్రతాలు పూజలు. ఈ మాసంలో వచ్చే నాగుల పంచమి చాలా ప్రత్యేకం.ఇంటిల్లిపాది పుట్టలో పాలుపోసి, ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజు (ఆగస్టు 13) నాగులపంచమి. శ్రావణమాసంలో వచ్చే పంచమిని నాగులపంచమిగా జరుపుకుంటారు.  భక్తులు నాగదేవతకు పాలు పోసి, పసుపు, కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. కొంతమంది ఉపవాసం ఉండి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంటిల్లిపాది పొద్దునే పుట్ట దగ్గరకు వెళ్లి ఆవుపాలు పోసి, జొన్న పేలాలు,  ఉండ్రాళ్లు, వడపప్పు, చలిమిడిని  ప్రసాదంగా పంచుతారు. పిల్లలకు కళ్ళకు, చెవులకు పుట్టమన్నును  రాస్తే రోగాలు రావనేది భక్తుల నమ్మకం. చాలామంది పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరం. నాగేంద్ర స్తోత్రం, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామాలు చదువుతారు. చదవడం రానివాళ్లు ‘నాగేంద్రస్వామియే నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి పూజలు చేస్తారు. నాగులపంచమి రోజున పూజ చేయాల్సిన విధానాన్ని శివుడే స్వయంగా పార్వతీ దేవికి చెప్పినట్లు స్కంధపురాణం చెబుతోంది.                      :::మహాముత్తారం,  వెలుగు