నల్గొండ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో మృతి చెందిన మహిమ గజరాజ్(29) మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేశారు అధికారులు. ఆమె మృతదేహాన్ని చెన్నైకు తరలించారు. మృతి చెందిన సమయానికి మహిమ మూడు నెలల గర్భిణి అని తెలుస్తోంది. రేపు ఢిల్లీ నుంచి డీజీసీఏ అధికారులు రానున్నారు. చాపర్ క్రాష్ లో మృతి చెందిన పైలెట్ మహిమ నాగార్జున సాగర్ లోని విజయపురి సౌత్ లో ఉన్న ఫ్లై టెక్ ఏవియేషన్ సెంటర్ లో పైలెట్ గా శిక్షణ తీసుకుంటుంది. ఇవాళ ఉదయం 10.25 కి ఆమె చాపర్ టేక్ ఆఫ్ అయింది. 11 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
గత ఆరు నెలలుగా ఫ్లైటెక్ ఏవియేషన్ సెంటర్లో మహిమ శిక్షణ తీసుకుంటుందని ఆ సంస్థ సీఈవో మమత పేర్కొన్నారు. ఒక్కరినే చాపర్‌లో పంపడం అనేది శిక్షణలో భాగమేనని పేర్కొన్నారు.పైలెట్ గా పర్ఫెక్ట్ అయిన తరువాతే ఒంటరిగా చాపర్లో పంపిస్తామన్నారు. ఈ ఘటనకు సంబంధించి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. చాపర్‌లో సాంకేతిక లోపం తలెత్తిందా? లేదా మరేదైనా జరిగిందా అనే విషయం విచారణ తర్వాతే తెలుస్తుందన్నారు సీఈఓ మమత. ఆమెతో సిగ్నల్స్ కట్ అయిన తర్వాతే.. ప్రమాదం జరిగినట్లు తెలుస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి:
