
- ఎన్‌వోసీ జారీకి డబ్బులు డిమాండ్..
నల్గొండ అర్బన్, వెలుగు : పటాకుల దుకాణం ఏర్పాటు కోసం ఎన్‌వోసీ జారీ చేసేందుకు డబ్బులు తీసుకున్న నల్గొండ ఫైర్ ఆఫీసర్‌ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ నల్గొండ డీఎస్పీ జగదీశ్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం... ఓ వ్యాపారి దీపావళి సందర్భంగా పటాకుల దుకాణం ఏర్పాటు చేసేందుకు ఎన్‌వోసీ జారీ చేయాలని నల్గొండ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎ.సత్యనారాయణరెడ్డిని కలిశాడు.
ఎన్‌వోసీ ఇవ్వాలంటూ రూ.8 వేలు ఇవ్వాలని ఫైర్ ఆఫీసర్ డిమాండ్ చేయడంతో సదరు వ్యాపారి ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో గురువారం ఫైర్ ఆఫీసర్‌ను కలిసి డబ్బులు అందజేశాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణరెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు పంపనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.