వైద్య సేవల్లో గ్యాప్ రావద్దు ..నల్గొండ జీఎంసీలో ఉన్నతాధికారుల కీలక సమీక్ష

వైద్య సేవల్లో గ్యాప్ రావద్దు ..నల్గొండ జీఎంసీలో ఉన్నతాధికారుల కీలక సమీక్ష

హైదరాబాద్, వెలుగు: ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి గ్యాప్ రావొద్దని, క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని వైద్య ఉన్నతాధికారులు సూచించారు. ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ల నుంచి పెద్ద హాస్పిటల్స్‌‌‌‌కు పేషెంట్లను రెఫర్ చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, రెఫరల్ సిస్టమ్‌‌‌‌ను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్స్ పనితీరుపై జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేందర్ కుమార్, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్‌‌‌‌లు గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

నల్గొండ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాలోని హాస్పిటల్స్ మధ్య సమన్వయం, రెఫరల్ విధానం, పేషెంట్లకు అందుతున్న సేవలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్లు, డీఎంహెచ్‌‌‌‌వోలు, టీవీవీపీ హాస్పిటల్స్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.