
నల్లగొండ జిల్లా పెద్దఊర మండలం ఏనమీది తండాలో విలేజ్ రీకన్‌స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థలో 12 మంది బాలికలపై అత్యాచారం కేసులో తుది తీర్పు చెప్పింది జిల్లా మొదటి అదనపు సెషన్ కోర్టు. నిందితుడు రమావత్ హరీశ్ నాయక్, నిర్వాహకులు ఇద్దరిని దోషులుగా నిర్ధారించింది. A-1 రమావత్ నాయక్, A-2 నిర్వహకులు శ్రీనివాస్ రావుకు యావజ్జీవ శిక్ష విధించింది. పది వేల రూపాయల జరిమానా వేసింది. దోషులకు పై కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం కల్పించింది. 2013లో ఐదో తరగతి చదువుతున్న బాలికలపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో ఎనిమిదేళ్ల తర్వాత కోర్టు తీర్పు చెప్పింది.