
పార్టీ, అభివృద్ధి కార్యక్రమాలకు తనని పిలువడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో రాష్ట్రంలో మొదటిసారిగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో నామా పాల్గొన్నారు. తనను ఎక్కడికి పిలిచిన వస్తానని, అభివృద్ధిలో తనని భాగస్వామిని చేయండని కార్యకర్తలకు, స్థానిక నేతలకు ఆయన పిలుపునిచ్చారు.
తనతో మీకు ఎక్కడ, ఎందుకు గ్యాప్ వచ్చిందో చెప్పాలంటూ నామా చేసిన కామెంట్స్ అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేశానని చెప్పారు. అందరం కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ నాయకులుకు ఆయన హితబోధ చేసారు. రానున్న ఎన్నికల ద్వారా రాష్ట్రంలో మూడోసారి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయంతో ముఖ్యమంత్రి కానున్నారని, అందుకు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం స్ఫూర్తిగా నిలవాలని తెలిపారు.