బీజేపీలో చేరిన టీఆర్ఎస్ ఎంపీటీసీ

బీజేపీలో చేరిన టీఆర్ఎస్ ఎంపీటీసీ

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీ బత్తుల మౌనిక శేఖర్ బీజేపీలో చేరారు. మంచిర్యాల పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎంపీటీసీ మౌనికకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఎంపీటీసీ మౌనికతో పాటు మరికొంత మంది టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో జాయిన్ అయ్యారు.

గ్రామాల సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించడం లేదని రఘునాథ్ ఆరోపించారు. రైతులకు రుణమాఫీ, పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. అందుకే గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఇతర నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నారని రఘునాథ్ చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీనే అధికారంలోకి వస్తుందన్నారు.