బాలికతో అసభ్య ప్రవర్తన.. 20 ఏండ్లు జైలు శిక్ష

బాలికతో అసభ్య ప్రవర్తన.. 20 ఏండ్లు జైలు శిక్ష

పంజాగుట్ట, వెలుగు: బాలికతో అసభ్యరకంగా ప్రవర్తించిన వ్యక్తికి నాంపల్లి అడిషనల్​సెషన్స్​ జడ్జి 20 ఏండ్లు  జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించారు. ఎస్ఆర్​నగర్ ఇన్​స్పెక్టర్​టి.శ్రీనాథ్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడకు చెందిన జి.రామకృష్ణ(44) డ్రైవర్​గా పనిచేస్తుంటాడు. 2022 లో ఓ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. 

బాధితుల ఫిర్యాదుతో అప్పటి ఇన్​స్పెక్టర్​సైదులు రామకృష్ణపై పోక్సో కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నాంపల్లి అడిషనల్​సెషన్స్​జడ్జి బుధవారం తీర్పు చెప్పారు. రామకృష్ణకు 20 ఏండ్లు జైలు, రూ.5 వేలు జరిమానా విధించారు.