శామ్సంగ్ నుంచి కొత్త లాప్టాప్స్

శామ్సంగ్ నుంచి కొత్త లాప్టాప్స్

శామ్​సంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికా నగరం లాస్ వేగస్​లో జరుగుతున్న కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్ 2026) వేదికగా గెలాక్సీ బుక్ 6 అల్ట్రా, గెలాక్సీ బుక్ 6 ప్రో, గెలాక్సీ బుక్ 6 ల్యాప్​టాప్​లను పరిచయం చేసింది.  ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్లతో ఇవి పనిచేస్తాయి.  వేగవంతమైన సీపీయూ, జీపీయూ, ఎన్​పీయూ వీటి సొంతం. వేడిని తగ్గించేందుకు తొలిసారి ప్రో సిరీస్ లో వేపర్ చాంబర్ వాడారు. గెలాక్సీ ఏఐ ఫీచర్లు పీసీ పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ నెల చివర నుంచి అమ్మకానికి వస్తాయి.