మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఊరట.. ఎన్నికల అఫిడవిట్పై పిటిషన్ కొట్టివేసిన నాంపల్లికోర్టు

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఊరట.. ఎన్నికల అఫిడవిట్పై  పిటిషన్ కొట్టివేసిన నాంపల్లికోర్టు

హైదరాబాద్:మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్పై దాఖలైన పిటిషన్ కొట్టేసింది నాంపల్లికోర్టు.ఎన్నికల అఫిడవిట్ లో మార్పులు చేశారంటూ శ్రీనివాస్ గౌడ్ పై రాఘవేందర్ రాజు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తగిన ఆధారాలు లేవని పోలీసులు తెలపడంతో పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.

2018 ఎన్నికల అఫిడవిట్ లో మార్పులు చేశారంటూ శ్రీనివాస్ గౌడ్ పై రాఘవేందర్ రాజు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని రాఘవేందర్ రాజు కోర్టు ను ఆశ్రయించారు. కేసునమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని రాఘవేందర రాజు కోర్టును కోరారు. ప్రజాప్రతినిధు ల కోర్టు ఆదేశాలమేరకు కేసు నమోదు మహబూబ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తగిన ఆధారాలు లేవని పోలీసులు నివేదిక సమర్పించారు.  

also read : బీజేపీతో పొత్తున్నా మల్కాజ్ గిరి ఎంపి టికెట్ నా కొడుకుదే: మల్లారెడ్డి

పిటిషనర్ రాఘవేందర్ రాజు పోలీసులు నివేదికపై అభ్యంతరం తెలిపారు. పిటిషన్ విచారించే పరిధి ప్రజాప్రతినిధుల కోర్టుకు లేదన్న జడ్జి.. ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో తేల్చుకునేందుకు హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ రాఘవేందర రాజు కు సూచించింది నాంపల్లి కోర్టు.