ఐ బొమ్మ రవి కస్టడీ, బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్

ఐ బొమ్మ రవి కస్టడీ, బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్

బషీర్​బాగ్, వెలుగు: ఐ బొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టు గురువారం వాదనలు పూర్తి చేసింది. ఇరు పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసింది. పోలీసుల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. రవి ఇంకా కీలక సమాచారాన్ని సేకరించాల్సి ఉందని, విచారణ దశలో బెయిల్ మంజూరు చేయరాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. నాలుగు వేర్వేరు కేసుల్లో రవిపై పైరసీ కార్యకలాపాలకు సంబంధించిన విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని పీపీ కోర్టుకు వివరించారు. 

రవి బెయిల్ పిటిషన్‌పై కూడా ఇరు పక్షాల వాదనలు విన్నకోర్టు, శుక్రవారం తీర్పు వెలువరించనుంది. అయితే ఇమ్మడి రవిపై మొత్తం ఐదు కేసులు నమోదు కాగా,మొదటి కేసులో రవి తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మిగిలిన నాలుగు కేసుల్లో ఒక్కో కేసుకు ఏడు రోజుల కస్టడీని సైబర్ క్రైమ్ పోలీసులు కోరారు.